Friday, December 19, 2014

SANTHANA KARAKA TRINADHA SWAMY

     SANTHANA KARAKA              

  AMBAVILLI TRINADHA SWAMY    

TEMPLE FOR CHLDREN


అంబావిల్లి శ్రీకాకుళం జిల్లలో పుణ్య వంశధార నదివొడ్డున వున్నది. 
చాల పురాతన మైన గ్రామము. బ్రాహ్మలు , వైశ్యులు, వెలమ, కుమ్మరి, తెలకలి, మేదర, చాకలి, మంగలి అలాగే న్నిరకముల వర్ణములు 
వారు కలిగినటువంటి గ్రామము. 

 అంబావిల్లి గ్రామం పర్లాకిమిడి  రాజు రాజ్యం లో చాల ముక్య మైన గ్రామం.
పూర్వపు రోజులలోపాద చారులు  గ్రామం లో ఆగి భోజనం తాయారు  చేసుకొని తిని విశ్రాంతి తీసుకొని మరలపోయేవారు. అక్కలకోట మహారాజ్ (స్వామిసామర్ద్ మహారాజ్ )దత్తాత్రేయుని మూడవ అవతారం  సమాది చెంధటము, అదే నెలలోఈ కుమ్మరి బాలుడు జన్మించేడు అంటారుశ్రావణ్ మాసం లో కుమ్మరి కులం లో బుడుమూరు వారి కుటుంబం లో ఒకబాలుడు జన్మిచేడుచిన్న తనం నుండి  బాబు  గ్రామం లో అందరికి తల లో నాలిక లఉపయోగ పడుతూ సేవ కార్యక్రమ  లో పల్గోనుచు వుండే వాడుచిన్నతనం నుండి దేవుడినందుదైవకార్య ములందు ఆసక్తి గల వాడయి బజన లు చేస్తూ ఉండేవాడుప్రక్కనే వున్నాశ్రిముకలింగం ఈశ్వరుడు గుడి కి ఎక్కువుగా వేలుతుండేవా రు. 
ఓక రాత్రి ఈతని కలలో  స్వామి కనిపించి బ్రహ్మవిష్ణు మహేశ్వరుని గుడి ఎక్కడ లేధని అంధుచే పవిత్రం అయన  వంసధార నధి ఒడ్డున అంబావిల్లి గ్రమములో వారి గుడి కట్టమని  కొరి తిరికుమ్మరి మనసు తల్లడిల్లి  ఒక దేవాలయం , ఏర్పాటు చేయాలని భావించేరు .
మరుచటి దినం  విషయం అందరికి చెప్పిఅమలు జరుపు కార్యక్రమం మొదలు పెడితిరి. తను బీద కుమ్మరి  ఆయనదున చాల శ్రమతీసుకొని త్రేనాధ స్వామి గుడి కట్టడం జరిగిందిగుడికట్టుటగురించి అ తనికి వున్నా కొద్ది పొలం అమ్మవలసి  వచ్చింది. ఆతనియెక్కశారీరక, మానసిక స్థితి చాలా విభిన్నంగా ఉండేది. తరచుగా, trance లోకి వెళ్ళేవారు.  మాట్లాడకుండా పరాధ్యానముగా ఉండేవారు. ఇలా వారు చిన్నతనము నుండే మహత్ముల ప్రవర్తనను కలిగి ఉండేవారు.  వారి మనస్సును పూర్తిగా భగవత్ ధ్యానములో ఉంచేవారు. ఇతర విషయాల పై ఆసక్తి తగ్గి, వారిలో వైరాగ్యా భావాలు పూర్తిగా ప్రస్పుటాంగబడ్డాయి. ఎక్కువ సమయం ధ్యానములో గడిపేవారు.  గొప్పవారు, బీదవారు, వారికి సమానమే.  కలసిమెలసి యుండెడివారు. ఎల్లప్పుడు ఎప్పుడూ గుడిలో ఉండెడి వారు లేధా వంసధార  నధి ఒడ్డున తెరిగే వారు. ఎల్లప్పుడు ఆత్మధ్యానమునందే మునిగి యుండెడివారు. . అణకువ, నమ్రత కలిగి  యహంకారము లేక యందరిని సంతసింప జే సెడి వారు
   దత్తాత్రేయుని మహిమ చే  గుడి చాల పెసిద్ధి చెందినది అందరి కోరికలు నెరవేరుస్తూ దత్తత్రేయులు వారు కొలువు దేరేరు. ముక్య్షము గా పిల్లలు లేనివారికి కల్పవ్రుక్షము గా  పేరుపొంధేరు త్రినధ స్వామి. సంతన కారక  స్వామి గా ప్రసిద్ది చెందేరు. ఎక్కడ ఎక్కడ నుంచో భక్తులు  పిల్లలు కలగని వారు వచ్హి మేళాలు
చెల్లించి సంతనము పొంధుచున్నారు.  స్వామి కి5 గాని లేక 7 గాని పూజలు దానినే మెళాలు అని గూడా అంటారు స్వామి కి చెల్లిస్థే సం  లోపు పిల్లలు కలుగుతారు. ఇంత  నీధర్సనం గల స్వామి ఎక్కఢ కంపించడు . ఇధి ఈ చుట్టుప్రక్కల ప్రజల అద్రుస్టము ఈ విధముగా కొన్నీ వేలమంధికి సంతానము కలిగినది. ప్రపంచములో ఎక్కడవున్నవారైనను పిల్లలు లేని వారు  అంబావిల్లి త్రినధ స్వామి ని మెక్కుకొని వారి క్రుపకు పాత్రులై  వారి వారి చిరకాల కొరికను తీర్చుకోను చున్నరు.  ఇధి   పురాతన మయినగుడి. పిల్లలు లేని వారికి కల్ప వ్రుక్షము కొరికలు థేర్చే  స్వామి.  ఆ స్వామి వారి అనుగ్రహము అంధరు పొంధి వారి క్రుపకు పాత్రులు కావలసినదిగా పురణాలు చెప్తున్నాయి. 

పిల్లలులేని వారు  స్వామిక్రుపతో పిల్లలు కలిగిన వారు వేలలో వున్నారు.   
రోజులలో మరు మూలా ప్రాంతాల నుండి వచ్చి స్వామి ని ధర్సించుకొని మరియు తాత అసి ర్వాచనం పొంది వారి వారికోరికలు నేరవేర్చు
కోనేవారుఈ రోజు న వారి మనవలతో ధర్సనము  చేసు సుకుంటున్నరు. 
ఇప్పటికీ గూడా ఆ దత్తాత్రేయుని  ప్రత్యత్య  నిదర్సనం   స్వామి వారికీ భోగం 
పెట్టినప్పుడు కుక్కలు అక్కడికి వచ్చిఅరుచుట కనిపించును. మరియొక 
నిదర్సనం.1972లో సంబ వించిన వంసాధారా వరద లలో ఆ చుట్టుప్రక్కల
 వందల గ్రామాలలో వరద నీరు వచ్హినది   గ్రామలు కొట్టుకొని పోయెయి గాని  ఈ  గుడీ ని  గాని గ్రామమును గాని తాకలెధు ఈ గుడి  ధగ్గరికి  రాలేదు  గ్రామం లో ఎవరికీనష్టం  కలిగించ లేదు. విచిత్రముగా చిన్నచెరువు గట్టు నీరు రాకుండా ఆపినధి. ఇధి స్వామి మహిమ కాక మరి ఏమి ఇంతకన్నా ఏ నిదర్సనం కావాలి.
తాతచ్చి పోయే సాధు పుంగావులతో మాట్లడుచు, ఆవిషయములను మననం చేసుకుంటూ పది మందికి చెప్తూకాలముగడుపుతుండేవారు. ఆ రోజులలో సన్యాసులు సాధువులు మజ్యహ్నం బోజనమునకు వచ్హేవారు.వారి వేషబాసలు రకరకలుగా వుండెడివి 
రాత్రులంధు కనిపెంచేవారు కారు. వారి ఆసీర్వచన భలమో మరి ఏ మో గాని
 ఇప్పటీ ఆ ఊరన్నా  ఆ గ్రామస్తులన్న ఆ ప్రాంతములో  చెప్పలేని గౌరవం.   రోజు  నాటికి గుడా  చుట్టు ప్రక్కల గ్రామాలలో పెళ్లి ఐన తర్వాత 
నూతన వధు  వరులు త్రినాధ స్వామి, దత్తాత్రేయుని  దర్సనము 

చేసుకొంటారు   చుట్టూ ప్రక్క గ్రామాలలో  వారికీ  టు వంటిఆపద 

వచ్చిన స్వామి ని తలచు  కొంటే వెంటనే పరిష్కారము   కనభడుతుంది. ఈ 

గుడిననందు  త్రీనాధ వ్రతాలు ఒక్క సారి జరిపించిన మూడు జన్మలకు 
పు ణ్యము వుంటుంధని పురణాలు చెప్తున్నాయి.పూర్వము ఏంధరో రాజులు,

బ్రాహ్మనులు వైస్యులు సూద్రులు త్రినాధ వ్రతాలు చేసుకొని పిల్లాపాపలు 

ధనధా న్యాలతో సుఖముగా బ్రతికే రు. రాజ్యాలు పోయున రాజులు వారి

రాజ్యాలు పొంధేరు. ఆడపిల్లలకు పెల్లుల్లు అయెయి.  



ఊద్యోగాలు  లేనివారు ఊద్యోగాలు పొంధినవారు వేలలోవున్నారు. 

గ్రహధోషలు నీవారనకు వ్రాతాలు  చెస్తుంటారు. కలియుగములో సంకట 

నాసన కారిగా ఆంబావిల్లి త్రినాధస్వామి పోరుపొంధేరు  ఒరిస్స వాసులు ము 

ఖ్యముగా పిల్లలు కలగని వారు వచ్చీ వ్రాతాలు చేసుకొనికొరిక  నేరవెర్చు

కునుచున్నారు. ఎన్నో కోర్కెలతో భక్తులు వేల సంఖ్యలో వస్తారు. శ్రికాకులం

పట్టనమునకు చెంధిన ఒక షవుకారికి పిల్లలు లేరు ఒరిస్సలో పేరున్న

చాలా గుల్లలో పూజచెయుంచెరు వుపయొగం లేకపొయుంది ఒక సాధు ద్వారా త్రినధస్వమి గురించి తెలుసుకొని  7 మేళాలు చెల్లించిన వెంటనే
 పిల్లలు కలిగేరు.  


హీరమండలం కు చెంధిన రామ లక్ష్మి  కు  సంతానం లేక 14 సంవత్స

రాలు బాధ పడింధి. అన్ని గుల్లు కు వెల్లింధి. అన్ని వ్రతాలూ చేసింధి.
 పిల్లలు కలగలేధు. భంధువుల ద్వారా అంబావిల్లి త్రినధ స్వామి గురించి 
తెలుసుకొని మ్రొక్కుకున్నధి. వెంటనే ఆమె కోరిక నెరవేరింధి. సంవక్షరము
లోపు బాబు తో త్రినధ స్వామి ధర్సనము చెసుకున్నధి. 
పర్లాకిమిడికి చెందిన  ఒక తహసిల్ధార్ భార్య కు యెన్నిసార్లు వచ్చిన పిల్లలు
కలగలేదు అధె విషయము తాత కి చెప్పగా 'నేను ఇన్నిసార్లు వచ్చాను. నాకు ఇంకా సంతానం కలగడం లేదు ఎందుకని అని తాత గారిని అడగగా 
 "ఎన్నిసార్లు వచ్చావన్నది కాదమ్మా! నీకు సమస్యలు ఉన్నవి అందుకే నీ
 కోరిక ఫలించడం లేదు. ఈ సారి వచ్చేటప్పుడు పాపతో రా తల్లీ!" అని దీవించారు. దానికి ఆమె సంతోష భరితురాలై సరే అన్నది. దీవించినట్లే పాప
 పుట్టినధి. 
ఆముధలవలసకు చెంధిన శ్యామల. వివాహం జరిగి 9 సంవత్సరాలు గడిచినా సంతాన ప్రాప్తి పొందలేదు. ఎందుకు భగవంతుడు నాపై కరుణ చూపడం 
లేదు అనుకున్నాది. సంతానం కావాలని పెద్దగుట్ట పైన ఉన్న 'బాబా సాదు ల్లా' అనే ముస్లిం భగవాన్నుని ప్రార్ధిచింధి. ఇంతలోనే  అనుకోని సంఘటన...ఓ సాధువు! వచ్చి తాత గురుంచి చెప్పెడు. త్రినాధస్వామి ని దర్సించిన వెంటనే పాప పుట్టింధి. 
ఈ లా చెప్పుకుంటూ పొతే వేలలో వున్నయి. ఆలయ విశిష్టతను  యెంత రాసిన ఇంక వుంటుంధి.అంబావిల్లివచ్చీ త్రినధ స్వమి దర్సనము చెసుకో లేని
వారు ఆదివారము నాడు అంబావిల్లి  త్రినధస్వామిని తలంచుకొని త్రినస్వామి వ్రతము ఇంట్లో చెసుకున్నచో వారు అనుకున్నపని నెరవేరును కోరికలు సిద్దించును. వ్రతము చాలా చిన్నధి. 

లేదా గుడి committe president కు ఫొనె చెసిన పూజలు జరిపించి ప్రసా ధము  పప్పించెధరు.  


గుడిలో ప్రతీ ఆధివారము పూజలు వ్రతాలు జరుగును   కార్యక్రమలు చూడచ
క్కగా వుంటయి  ఈ కలియుగంలో  శ్రీకాకులం   జిల్ల భక్తులకు  కొంగు బంగా రమై కోరికలు తిర్చే స్వామి త్రినాధ స్వామి. త్రినాధ స్వామి ఆసీర్వచనం అన్ని ప్రాంతాలలో వున్న భక్తులు పొంధవలిసినధిగా స్తల పురాణము కోరుచున్న ది.


భగవద్గీత చతుర్థాధ్యాయమున 7, 8, శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు 
ఇట్లు సెలవిచ్చియున్నారు. "ధర్మము నశించునపుడు అధర్మము వృద్ధి
పొందునపుడు నేను అవతరించెదను. సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గు
లను శిక్షించుటకు, ధర్మస్థాపన కొరకు, యుగయుగములందు అవతరించె
దను". ఇదియే భగవంతుని కర్తవ్య కర్మ.. త్రినాధ స్వామి ఆ మారుమూల
 గ్రామములో చదువులేని, ఆమాయక ప్రజల గురుంచి ప్రజల కోర్కెలు తీర్చు
టకె  అవతరించెరు.   
  
"ధర్మం" ఎక్కడ కొలువై ఉంటుందో శ్రీ కృష్ణభగవానుడు.. అక్కడే ఉంటాడని భక్తుల విశ్వాసం. దుష్టశిక్షణార్థం భూలోకమున అవతరించిన శ్రీ కృష్ణుడు వేరే వేరే రూప లలోఅవతరిస్తుటరు. ధర్మన్ని కాపాడు తుంటారు. చిన్న  నము
 లో విచిత్రమైన వ్యక్తులు వచ్చి గుడి లో జ్ఞానము చేసీ వెల్లెవారు.ఒకలిద్దరు
శరీరము మీధ వున్న బట్టలు తీసి దిగంబరముగా జ్ఞానము చేసే వారు. అప్పుడు అటువెపు  ఆడవాల్లు రాకుండాచుసేవారు.  ఒకసాధు ఒళ్ళు అంత
  ఉల్లిపాయలు కట్టుకొనేవారు. ఆయనని పిల్లలు రాళ్ళతో కొట్టేవారు దానికి
 ఆయన ఆనందముగా వంసధారా ఈసుకలోను, తోటల లోనుపరుగేడుతుండే
వారు.  ఆయన దత్త స్వరూపమని సాధులుచెప్పేరు. వారు విచిత్రముగా రక  రకాలుగా ప్రవర్తించేవారు కొంత సేపు తర్వాత వెళ్ళిపో యేవారు ఎటువేల్లెవరో
ఎవరికీ కనిపించేవరుకాదు.వారు కొండలలో తిరిగే పున్యపురుషులు అని
 అనుకొనేవారు.  

దేముని పండగ సమయములో తప్పితగుల్లఆటలు ,తోలు బొమ్మ ఆటలు ,

బ్బరు బొమ్మల  ఆటలు జరుగు తున్డేవి ఇవి కాకా చెంచువారుగారిడీ వా

రు వచ్చి వారి వారి ప్రదర్సనలు  ఇస్తుండేవారు. గుడి కట్టిన నాటి నుండి 
ప్రతీ సంమొదటి  తెలుగు పండగ ఉగాది తర్వాత  వైశాఖ మాసంలో దే ముడి

పండగ అతి విభవంగా జరిపిస్తుండేవారు నాటికీగూడా వైశాఖ మాసం లో

ఆదివారాలు మరియు పున్నము నాడు చాల పెద్దపండగలు జరుగుత యి.
వేలాదిమంది వస్తారుచూచుటకు కన్నుల పండగగా వుంటుంది. 

ఎక్కడలేనటువంటి గొప్ప విషయముకామధేనువు మరియు కల్పవృక్యము మరువలేని విధముగా కట్టటము జరిగిందిచుసిన వారు మరచి పోలేని విధము గా వున్నవి. అంబావిల్లి త్రినధస్వామి ని తలచినవారి కోర్కెలను ఈ కమదేనువు కల్పవ్రుక్షము తీరుస్థాయి అని అంటారు.

నాలుగు తరాల క్రితము కట్టినగుడి అయనంధువలన గోడలు పడయినాయి. 
గుడి భగము ధెబ్బ తిన్నది. 

ప్రస్థుత గ్రామ ప్రేసిడెంట్ చెట్టు స్రినివాసరావు  కొత్త గుడి కట్టే పనిని తన

భుజములపై వేసుకొని కార్యక్రమము జరిపించు చున్నరు. గ్రామస్తు లు

మరియు భక్తుల సహకరము తో క్రొత్తగా గుడి నిర్మిస్తున్నారు. గ్రామ కమిటి

పరివెక్షనలో జరుగు తున్నధి. భక్తు లకు ఇటువంటి అవకాసము ఎప్పు డొగాని రాధు.భక్తులు చేయగలిగిన సహయము చేసి ఆవకసము
ను సద్వినియొయము చెసుకుంటున్నారు. ఆ స్వామి అనుగ్రహముతో చక్క గా జరుగుతున్నది వచ్హిన అవకాసమును విషేషముగా వుపయొ గించు కొనుచున్నారు. భక్తులు తోచిన సహయము చేసి  త్రినధ స్వామి అను గ్రహ ము పొంధి వారి కొర్కెలు నెరవేర్చు కొనుచున్నారు. ఇలాంటి అవకాసము వచ్చి నంధులకు ఆనంధపడుతూ సహాయముచెయవలసినధిగ కమిటి కొరుచున్నది.

కుమ్మరి తాత భొధనలు 

మనిషిని, మృగాన్ని విభజించే రేఖ జ్ఞానమే. ఆహార, నిద్రాభయ మైధునా

లు పశువులకూ, మానవులకూ సామాన్యమే. జ్ఞానమొక్కటే మానవుణ్ణి 

పశువుకంటే విశిష్టుని చేస్తుందని, ఆ జ్ఞానమే లేనినాడు మానవుడు 

పశువే అవుతాడని విజ్ఞులు చెప్తారు. ఒక భక్తుదు తాతకి బ్రహ్మస్తితి 

పొందట  ఆంటే ఎమిటీ అని అడిగెడు నీ పిల్లలో ఏమి చూస్తున్నావో 

అందరిలో దానినే చూడటం బ్రహ్మస్తితి పొందటమే అని  తాత జెవబు 

చెప్పెరు. 



విశేష ధనం ఖర్చుపెట్టి తామొక్కరే ఒక పుణ్యకార్యం చేయలేనపుడు, 


పదిమంది నుంచి విరాళాలు సేకరించి చేస్తారు.అపుడు ఆ విరాళాలిచ్చి

నవారందరూ ఆ పుణ్య కార్యాచరణ ఫలం పొందటానికి అర్హులౌతారు.

ఒక పుష్పాన్ని దేవుని పాదాలవద్ద ఉంచుతున్నామంటే – 


ఆ పూవు పూయటానికి కారకుడైన తోటమాలికి కూడా ఆ పూజాఫలం


లో భాగం అందుతుంది. కేవలం ఎన్నో గ్రంథాలు చదవటం పాండిత్యం 


కానేరదు. పాండిత్యం అంటే జ్ఞానమే. జ్ఞానానికి నిదర్శనం సర్వులలో 


దైవాన్ని దర్శించటం.  


దయగల వారందరూ దైవసమానులే. ఏ ధర్మమైనా దయామూలమైతేనే ఆదరణీయం. దయలోనే ధర్మాలన్నీ అంతర్లీనమై ఉన్నాయని విజ్ఞులంటారు.  వ్యక్తుల స్వభావాలను వారి చేతలద్వారా మాత్రమే నిర్ణయించగలుతాముగానీ, వారి వేష, భాషణలను బట్టి సంపూర్ణంగా అంచనావేయలేము. శరీరాలు అనిత్యాలు. వైభవాలు శాశ్వతంకావు. 

మృత్యువు నిత్యమూ చేరువలో ఉంది. ఈ సత్యాన్ని గమనించి ధర్మాన్ని సాధించాలని పెద్దలు ఆత్మీయంగా హెచ్చరిస్తున్నారు. ధర్మాన్ని ఆచరించని వాడు జీవించి ఉన్నా మృతుడే. బంధువులందరూ మన హితవుకోరే వారని, మనతో బాంధవ్యం లేని వారు మన హితవును కోరరని అనుకోవటానికి వీలు లేదు. బంధువులలో మన ఔన్నత్యాన్ని చూచి ఈర్ష్య పడేవారు, మనకు ఇబ్బందులు కలిగితే లోలోపల ఆనందించేవారు  వున్నరు. 

మనస్సులోని మాలిన్యాల వికృత రూపమే క్రోధం. "వృక్షాలు పరులకోసమే ఫలాలను ఇస్తున్నాయి, గోవులు పరులకోసమే పాలను ఇస్తున్నాయి, నదులు పరులకోసమే ప్రవహిస్తున్నాయి, ఈ శరీరం కూడా పరోపకారం కోసమే" ("పరోప కారార్థమిదం శరీరమ్") అన్నాడు భర్తృహరి.

ఎప్పటికైనా నశించిపోయే దేహాన్ని సాధనంగా చేసికొని, ఎప్పటికీ నశించని యశస్సును, పుణ్యాన్ని- పరోపకారం చేయటం ద్వారా సంపాదించుకోగల అవకాశం అందరికీ ఉంది. ఎవరూ అర్థించకుండానే అవసరాన్ని గుర్తించి సహాయం అందించటం, చేసిన ఉపకారానికి ప్రతిఫలాన్ని ఆశించకపోవటం మనలో వుండలి. ధ్యానం, భక్తి, జపం, నామస్మరణ మొదలుగువాటితో చిత్తవృత్తుల వైవిధ్యం తొలగించుకోవడానికి చేసే ప్రయత్నమే సాధన. ప్రకృతి ఒడిలోనుండి దైవఒడిలోనికి పయనించడమే సాధన. టన్నుల కొలది
శాస్త్రపరిజ్ఞానం కంటే ఔన్సుడు ఆచరణ మేలు. 

నీ మతి ఎలా ఉంటుందో నీ గతి అలాగే ఉంటుంది.  అన్నింటి కంటే ఉత్తమ

జన్మ మానవజన్మ. సమస్త జీవరాశులలో మాట్లాడేశక్తి మానవునికే ఉంది.

మానవుడు సంఘజీవి. అందరితో చక్కని సంబంధ భాంధవ్యాలు  కలిగి

యుండి సామరస్యముగా ఉండడం చక్కటి సుగుణం. ఇందుకు కావాల్సింది

ప్రధానంగా మృదుభాషణం. శరీరానికి రోగాలు వచ్చినట్లే మనస్సుకీ కోపం,

ఉద్రేకం, అసూయ అనే రోగాలు వస్తుంటాయి. 



మనస్సులో ఈ రోగాలున్నప్పుడు మాటల్లో అశాంతియే ఉంటుంది. శరీరా

నికి వచ్చే రోగాలు ఆ శరీరం మరణించినప్పుడు పోతాయి. మనస్సుకి వచ్చే

రోగాలు  వాటి వాసన మరుజన్మకు గుడా వుంటాయు.నీ పేరాశను, లోభము
నుపూర్తిగా వదలనంతవరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు. ఎవరి 

మనస్సు ధనమందు, సంతానమందు, ఐశ్వర్యమందు లగ్నమై యున్నదో, 

వాడా యభిమానమును పోగొట్టుకొననంతవరకు బ్రహ్మము నెట్లుపొంద 

గలడు. ఎక్కడ పేరాశగలదో యక్కడ బ్రహ్మము గూర్చి యాలోచించుటకు 

గాని ధ్యానమునకుగాని తావులేదు.  ఎవడయితే ఫలాపేక్షరహితుడు కాడో,

ఎవడు ఫలాపేక్ష కాంక్షను విడువడో, ఎవనికి వానియందు విరక్తి లేదో

యట్టివాడు గొప్పచదువరి యైనప్పటికి వాని జ్ఞానమెందుకు పనికిరానిది.

ఆత్మసాక్షాత్కారము పొందుట కిది వానికి సహాయపడదు.

నీవు దాహము గలవారికి నీరిచ్చినచో, ఆకలితో నున్నవారికి అన్నము 

పెట్టినచో, దిగంబరులకు గుడ్డలిచ్చినచో, నీ వసారా యితరులు కూర్చొనుటకు 

విశ్రాంతి తీసుకొనుటకు వినియోగించినచో నిశ్చయముగా భగవంతుడు 

మిక్కిలి ప్రీతి చెందిదును. కొరికలు నెరవెర్చును.  ఎవరైన సర్వస్యశరణాగతి 

చేసి అంబావిల్లి త్రినధ స్వామి  ను మ్రొక్కినచో, పిల్లలు పాపలు కలిగి వారికి సర్వసంపదలు కలుగును. కొరికలు సిధించును సర్వ ఆపదలు నుండీ 

నీవారణపొంధును. త్రిమూర్థులు మిమ్మలను సర్వధా కాపడును.  దానము
 చేసి మనచేయి పుచ్హుకొనేవారి  చెతిమీద ఏన్ని సార్లు వుంటే అంతమంధి మనకు  రునపడి వుంటారు. ఇది జన్మ జన్మలకు దాచుకున్న సంపధ.    
మేధావులంతా సర్వజ్ఞ మైన సహజస్థితిని పొందడానికి మానవ జన్మ మనకో సాధనం అనే చెప్పేరు.  ఇలాంటి ఉత్కృష్టమైన మానవ జన్మ పొందటానికి కారణం గతించిన జన్మల్లో చేసుకున్న పుణ్యకర్మల ఫలితమే. అందువల్లనే నీచజన్మలు పొందలేదు. బుద్ధిని ఉపయోగించుకొని, ఈ జన్మనెలా సార్ధకం చేసుకోవాలో తెలుసుకోవాలి.

అన్నీ భూమిలో దొరికే లోహాలే అయినా ఇనుమూ, బంగారమూ ఒకటే 

అనలేం కదా! ఇనుము తక్కువనీ, బంగారం ఎక్కువనీ కాదు కొన్ని విశిష్ట 

అంశాలు బంగారానికి ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చేలా చేశాయి. అలాగే 

కొందరిలో కనిపించే కొన్ని దివ్య అంశాలు వారిని దైవ భావంతో చూసేలా 

చేస్తాయి. గవంతుడు వారి ని రక్షించును. యోగము, త్యాగము, తపస్సు, 

జ్ఞానము. మోక్షమునకు మార్గములు. వీనిలో నేదైన అవలంబించి 

మోక్షమును సంపాదించనిచో మీ జీవితము వ్యర్థము. "కూతుళ్ళనూ, 

కోడళ్ళనూ ఒకే రకంగా చూసుకో! అదేవిధంగా కొడుకులనూ, అల్లుళ్ళనూ ఒకే 

రకంగా చూసుకో!  చేయవలసిన సాధన ఇదే. అద్వైతం అంటే కూడా ఇదే!" 

అని  తాత ఉపదేసించెను.  ఆ మాటలను ప్రతీ ఒక్కరు ఆచరనలో పెట్టలి. 

మ్రుతి చెందేవరకూ కామ భోగాలను అనుభ వించడమే పరమా వధిగా 

భవిస్థారు. విషయ సుఖాలను అనుభ వించడం కొసం అక్రమ ధనార్జన కు 

పూనుకుంటరు. మోసాలు చెస్తారు ఆభద్ధాలు ఆడతారు పరులను భాద పెడతారు. 
శ త్రువును చంపెశేను, ఓదించెను  తలపెట్టిన పని సాదించే స మ ర్దుణ్ణి  బల వంవంతున్ని  అని తలుస్థారు. చివరకు ఘొర నరకాల పాలవుతారు,
దేహం కంటే యుంద్రి యాలు  యుంద్రి యాలు కంటే మనస్సు  మనస్సు కంటే బుద్ది బుద్ది కంటే ఆత్మ గొప్పవి. నీకున్నది తృప్తిగా తిని, ఇతరులకు ఆదరంగా
 పెట్టుకో"  శాంతమే భూషణం. మౌనమే అలంకారం. తాత సారంలోసారాంశం

వంటివారు, నశించిపోయేబాహ్యాంశాలపై అభిమానం లేనివారు.తాత కు బీద,
ధనిక తారతమ్యాలు లేవు. అందరూ సమానులే. జీవకోటియంతటికి
ఆహారము,నిద్ర, భయము, సంభోగము సామాన్యము. మానవున కివిగాక 
యింకొక శక్తిగలదు. అదియే జ్ఞానము. దీని సహాయముననే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు. ఇంకే జన్మయందును దీని కవకాశము లేదు. ఈ కారణము చేతనే దేవతలు కూడ మానవజన్మను ఈర్ష్యతో చూచెదరు. వారు కూడ భూమిపై మానవజన్మమెత్తి మోక్షమును 

సాధించవలెనని కోరెదరు.
ఎవరహంకారపూరితులో, ఎవరింద్రియ విషయములగూర్చి యెల్లప్పుడు  చింతించెదరో, వారు నిష్ప్రయోజనులు. మనస్సును పవిత్రమొనర్చుట తప్పనిసరి యవసరము. అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నము
లన్నియు ఆడంబరము డాంబికము కొరకు చేసినట్లగును. కావున దేనిని జీర్ణించుకొనగల వాడే మొక్షము పొంధును  అనేకమంది సన్యాసులు ఇండ్లు విడచి యడవులలోని గుహలలోను, ఆశ్రమములలోను, నొంటరిగా నుండి జన్మరాహిత్యము, మోక్షము ను సంపాదించుటకు ప్రయ్తత్నించెదరు. వారితరులగూర్చి యాలోచించక ఆత్మానుసంధానమందే మునిగియుందురు .
మరణకాలమున మనస్సునందున్న కోరికగాని యాలోచనగాని వాని భవిష్యత్తును నిశ్చయించును. భగవద్గీత 8వ అధ్యాయమున 5, 6 శ్లోకములలో శ్రీకృష్ణు డిట్లు చెప్పియున్నాడు. "ఎవరయితే వారి యంత్యదశయందు నన్ను జ్ఞప్తియందుంచు కొందురో వారు నన్ను చేరెదరు. ఎవరయితే యేదో మరొక దానిని ధ్యానించెదరో, వారు దానినే పొందెదరు." అంత్యకాలమందు మనము మంచి యాలోచనలే మనస్సునందుంచుకొన గలమని నిశ్చయము లేదు. అనేకమంది అనేక కారణములవల్ల భయపడి యదరి పోయెదరు. శ్రీక్రుష్నుని జపించుట మరచెధరు.  దాని కొరకు మనము బ్రతికివుండు కాలమున ఆదే పనిగ భగవంతున్ని తలచినచొ ఆకరి దసలో ఆ పరమేస్వరుడు  మన మనసు నందు  వుండును పరలోకములో సాస్విత   అనందము కలుగచేయును   



భగవంతుడు మనకు ఈ లోకములో జీవించి ఉండే వ్యవధి చాలా తక్కువగా ఇచ్చాడు. ఈ సమయాన్ని ఆనందమయం చేసుకుంటూ మంచి చేయాలి. మనం మరణించు గాక, మనం చేయు మంచికి మరణం లేదు. నేను అనే అహన్ని వీడి, మనము అందరమూ ఒక్కటే అని, అందరిలోనూ ఆ పరమాత్ముడు ఉన్నాడనే సత్యాన్ని గ్రహించాలి.
మంచి గాని చెడ్డగాని చేయుటకు నీవు కర్తవని అనుకొనరాదు. గర్వాహంకార 

రహితుడవయి ఉండుము. అని తాత తనభొధనలో చెప్పెరు



COMMITTEE PRESEDENT 

CHETTU SRINIVASA RAO -CELL NO 09441319963
                                      
& O9441080259

Address =  Trinadha swamy temple
              
Ambavilli,  kittalapadu post
             
Hiramandalam mandalam,


           
Srikakulam district  Andhrapredesh  INDIA






VILLAGE PRESIDENT CHETTU SRINIVASARAO